JC Prabhakar Reddy: ఎంపీడీవో కార్యాల‌యంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బైఠాయింపు.. స‌మ‌స్య ప‌రిష్క‌రించే వ‌ర‌కు వెళ్ల‌బోన‌ని స్పష్టీక‌ర‌ణ‌

jc prabhakar reddy protests
షార్ట్స్‌లో చూడండి
ఉపాధి హామీ బిల్లులు చెల్లించట్లేదని అధికారుల‌పై అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్, టీడీపీ నేత‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మండిప‌డ్డారు. పెద్ద‌వ‌డుగూరు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి అక్క‌డే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బైఠాయించారు. ఉపాధి హామీ బిల్లులు ఎందుకు చెల్లించ‌ట్లేద‌ని అక్క‌డి అధికారుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. కోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ బిల్లులు చెల్లించ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు. బిల్లులు చెల్లించే వ‌ర‌కు తాను కార్యాల‌యం నుంచి వెళ్లేది లేద‌ని ఆయ‌న తెగేసి చెప్పారు.
Go Back to Shorts
JC Prabhakar Reddy
Andhra Pradesh
Telugudesam

More Telugu News