Bhavina Patel: సచిన్ ను కలిసి నా మెడల్ చూపిస్తాను: పారాలింపిక్ క్రీడాకారిణి భవీనా పటేల్

  • టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్
  • టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో భవీనాకు రజతం
  • సచిన్ తనకు స్ఫూర్తి అని వెల్లడించిన భవీనా
  • సచిన్ ఘనతలతో ప్రేరణ పొందానని వివరణ
Bhavina Patel wants to meet Sachin

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన దివ్యాంగ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ మీడియాతో మాట్లాడింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు స్ఫూర్తి అని వెల్లడించింది. సచిన్ సుదీర్ఘ కెరీర్ లో అనేక ఘనతలతో తాను ప్రేరణ పొందానని, ఆయనకు తాను సాధించిన పతకం చూపిస్తానని వివరించింది.

సచిన్ ను స్వయంగా కలిసి కనులారా ఆయనను చూడాలని ఉందని తన మనోగతాన్ని పంచుకుంది. సచిన్ ఉత్తేజభరితమైన ప్రసంగాలు వినాలని ఉందని, ఆయన మాటలతో తనకు మరింత ఆత్మవిశ్వాసం లభిస్తుందని భవీనా పటేల్ తెలిపింది. భవీనా టోక్యో ఒలింపిక్స్ లో టేబుల్ టెన్నిస్ అంశంలో రజతం గెలవడంతో భారత క్రీడావర్గాల్లో హర్షం వెల్లివిరుస్తోంది.

More Telugu News