Avasarala: 'నూటొక్క జిల్లాల అందగాడు' ట్రైలర్ రిలీజ్!

101 Jillala Andagadu trailer release
షార్ట్స్‌లో చూడండి
అవసరాల శ్రీనివాసరావుకి నటుడిగా .. దర్శకుడిగా .. రచయితగా మంచి పేరు ఉంది. ఆయన రచయితగా పనిచేస్తూ, కథానాయకుడి పాత్రను పోషించిన చిత్రంగా 'నూటొక్క జిల్లాల అందగాడు' రూపొందింది. సాగర్ రాచకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో హీరో 'బట్టతల' సమస్యతో బాధపడుతూ ఉంటాడు. బట్టతల ఉంటే పెళ్లి కాదని భావించి, విగ్గు పెడతాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గర ఆ నిజాన్ని దాచడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఇలా బట్టతల కారణంగా ఇబ్బందులు పడుతూ అందులోనే నవ్వులను పూయించే కథగా ఈ సినిమా కనిపిస్తోంది.

అవసరాల శ్రీనివాస్ సరసన రుహాని శర్మ నటించిన ఈ సినిమాకి, శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సమకూర్చాడు. శిరీష్ .. రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మించిన ఈ సినిమాను, వచ్చేనెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. బట్టతలను దాచే విషయంలో అవసరాల చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందనేది తెరపైనే చూడాలి.

Go Back to Shorts
Avasarala
Ruhani Sharma

More Telugu News