HCU: 'ఐయామ్ సో బ్యాడ్ డాటర్' అంటూ.. హెచ్‌సీయూలో ఉరేసుకున్న ఎంటెక్ విద్యార్థిని

HCU Student commit suicide in hostel room
  • హాస్టల్ గదిలోని కిటికీ చువ్వలకు ఉరేసుకున్న మౌనిక
  • హెచ్‌సీయూలో ఎంటెక్ నానో టెక్నాలజీ రెండో సంవత్సరం
  • మిస్ యూ అమ్మా.. నాన్నా అంటూ సూసైడ్ నోట్
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ విద్యార్థిని ఉరివేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన ఆర్. మౌనిక (27) హెచ్‌సీయూలో ఎంటెక్-నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. లేడీస్ హాస్టల్ ఎల్‌హెచ్-7లోని రూము నంబరు 24లో ఉంటోంది.

ఆదివారం రాత్రి అందరితోపాటే నిద్రపోయిన మౌనిక సోమవారం ఉదయం గది నుంచి బయటకు రాలేదు. డోర్ తెరుచుకోకపోవడంతో అనుమానించిన స్నేహితులు ఆమెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి హతాశులయ్యారు. వెంటిలేటర్ కిటికీ చువ్వలకు ఆమె ఉరివేసుకుని కనిపించింది. మౌనిక ఆత్మహత్యకు కారణం తెలియరాలేదు.

అయితే, ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నోట్‌లో.. ‘ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్నా.. అమ్మ’ అని రాసింది. ఈ నెల 18నే హాస్టల్‌కు వచ్చిన మౌనిక అంతలోనే ఇక లేదన్న విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
HCU
Student
Suicide
Hyderabad
Peddapalli District

More Telugu News