హైదరాబాదులో నడిరోడ్డుపై కాలిపోయిన పోలీసు వాహనం... వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

హైదరాబాదులో నడిరోడ్డుపై కాలిపోయిన పోలీసు వాహనం... వీడియో ఇదిగో!

Police vehicle caught in fire in on busy road in Hyderabad
  • ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ఘటన
  • పోలీసులతో వెళుతున్న టాటా సుమో
  • ఒక్కసారిగా ఇంజిన్ లోంచి మంటలు
  • అప్రమత్తమై వాహనం నిలిపివేసిన డ్రైవర్
హైదరాబాదులో ఓ పోలీస్ వాహనం నడిరోడ్డుపై దగ్ధమైంది. టాటా సుమో వాహనంలో పోలీసులు వెళుతుండగా ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు చెలరేగడంతో ఈ పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసిన కాసేపటికే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.

ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన వచ్చి మంటలు ఆర్పేశారు. ఈ ఘటనతో ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. టాటా సుమో ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Police Vehicle
Hyderabad
Fire Accident
Telangana

More Telugu News