Telangana: తెలంగాణలో మరో 614 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు
  • గ్రేటర్ హైదరాబాదులో 73 కేసులు
  • రాష్ట్రంలో నలుగురి మృతి
  • ఇంకా 9,141 మందికి చికిత్స
Telangana corona daily cases bulletin

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,11,251 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 73, కరీంనగర్ జిల్లాలో 61, వరంగల్ అర్బన్ జిల్లాలో 59 కొత్త కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 657 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,44,330 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,31,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,141 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,800కి చేరింది.

More Telugu News