ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ పై విద్యార్థి సంఘాల జేఏసీ అసంతృప్తి
- ఈ నెల 18న జాబ్ క్యాలెండర్ విడుదల
- 36 ఉద్యోగాలే చూపించారన్న జేఏసీ
- కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్
- ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిక
ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 28న ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉచిత పథకాలతో కాలయాపన చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు.