తెలుగులోకి మరో రీమేక్ .. కీలకపాత్రలో రావు రమేశ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులోకి మరో రీమేక్ .. కీలకపాత్రలో రావు రమేశ్?

Rao Ramesh in Karnan remake
  • క్రితం నెలలో విడుదలైన 'కర్ణన్'
  • ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలు
  • 'లాల్' పాత్రలో రావు రమేశ్
విభిన్నమైన ... విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా రావు రమేశ్ పేరు కనిపిస్తుంది. డిఫరెంట్ గా ఉండే ఆయన డైలాగ్ డెలివరీ, తెరపై ఆయనకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. ప్రస్తుతం తెలుగులో బిజీగా ఉన్న కేరక్టర్ ఆర్టిస్టులలో రావు రమేశ్ ఒకరు. 'కర్ణన్' రీమేక్ లో ఆయన ఒక కీలకమైన పాత్రను చేయనున్నాడనే వార్త ఒకటి ఇప్పుడు జోరుగా షికారు చేస్తోంది. క్రితం నెలలో తమిళనాట విడుదలైన 'కర్ణన్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ధనుశ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బెల్లంకొండ శ్రీనివాస్ తీసుకున్నాడు. ఆయన హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. 'కర్ణన్'లో కథానాయకుడికి మార్గదర్శకుడిగా నిలిచే ఒక కీలకమైన పాత్రలో 'లాల్' నటించారు. కథాపరంగా ఈ పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రను తెలుగులో రావు రమేశ్ తో చేయించాలని అనుకుంటున్నారట. అందుకోసం సంప్రదింపులు నడుస్తున్నాయని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Bellamkonda Srinivas
Srikanth Addala
Rao Ramesh

More Telugu News