కుక్కను బెలూన్లకు కట్టి ఎగరేసిన యూట్యూబర్ అరెస్ట్
- వ్యూస్ కోసం ప్రయత్నం!
- కుక్కకు హైడ్రోజన్ బెలూన్లు కట్టిన గౌరవ్ శర్మ
- వీడియోపై జంతుప్రేమికుల ఆగ్రహం
- కేసు నమోదు చేసిన పోలీసులు
- క్షమాపణలు చెప్పిన యూట్యూబర్
గౌరవ్ తన పేరుతోనే గౌరవ్ జోన్ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఇటీవల అప్ లోడ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. ఓ పార్కులో తన పెంపుడు కుక్క డాలర్ కు రంగురంగుల బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరేశాడు. ఆపై తన ఘనకార్యాన్ని వీడియోలో వర్ణిస్తూ వ్యాఖ్యానం వినిపించాడు. వీడియోలో ఓ చోట కుక్క ఓ అపార్ట్ మెంట్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎగరడం కనిపించింది.
అయితే ఓ కుక్కను అలా హింసించడం సరికాదని జంతుప్రేమికులు మండిపడ్డారు. దాంతో దిగొచ్చిన గౌరవ్ వీడియో తొలగించి, క్షమాపణలు చెప్పాడు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకుని వీడియో రూపొందించానని తెలిపాడు. అయితే ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. గౌరవ్ పైనా, అతడి తల్లి పైనా కేసు నమోదు చేశారు. గౌరవ్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ పై విడుదలయ్యాడు.