Mahesh Babu: త్రివిక్రమ్ మూవీలో శిల్పాశెట్టి పాత్ర ఏమిటంటే..!

Shilpa Shetty playing aunty role in Mahesh Babu movie
షార్ట్స్‌లో చూడండి
త్రివిక్రమ్ సినిమాల్లో కీలకమైన రోల్ ను సీనియర్ స్టార్ హీరోయిన్ చేయడమనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. నదియా .. స్నేహ ... ఖుష్బూ .. టబు .. దేవయాని వంటి సీనియర్ హీరోయిన్లకు తన సినిమాల్లో ఆయన ముఖ్యమైన పాత్రలనిస్తూ వచ్చాడు. అయితే ఆ పాత్రలను డిజైన్ చేసిన తీరు కారణంగా, కథలో కీలకంగా నిలవడమే కాకుండా వాళ్లకి అవి మంచి పేరును తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్ తో ఆయన చేయనున్న సినిమాకి గాను శిల్పా శెట్టి పేరు వినిపించింది.

తెలుగులోను హీరోయిన్ గా శిల్పా శెట్టి ఓ నాలుగైదు సినిమాలు చేసింది. ఆ తరువాత ఇక బాలీవుడ్ కే పరిమితమైంది. ఆమె ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించనుందనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ఈ సినిమాలో మహేశ్ బాబు పిన్ని పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. చాలాకాలం తరువాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇదే కావడం, మరో ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఈ సినిమాకి 'పార్ధు' అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కృష్ణ పుట్టినరోజైన ఈ నెల 31వ తేదీన టైటిల్ పోస్టర్ రానుందనే టాక్ వినిపిస్తోంది.
Go Back to Shorts
Mahesh Babu
Pooja Hegde
Shilpa Shetty

More Telugu News