ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేస్తోన్న పోలీసులు

tdp leaders house arrest
క‌రోనా బాధితులకు భరోసా కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ నేత‌ల‌ను గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. క‌రోనా బాధితులకు భరోసా కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేత‌లు అన్ని జిల్లాల్లోని క‌రోనా రోగుల‌ను పరామర్శించాల‌ని భావించారు. వారికి మెరుగైన వైద్య సౌక‌ర్యాలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు ఉద‌య‌మే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ శాసన సభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే, ఉంగుటూరులో ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, దెందులూరులో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో పాటు ప‌లువురు నేత‌ల‌ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.  
Go Back to Shorts
Telugudesam
Andhra Pradesh

More Telugu News