Chiranjeevi: నా స్టార్‌డంని, క‌మ‌ర్షియ‌ల్ స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌: చిరంజీవి

  • ఆయ‌న సినీ ప్ర‌స్థానంలో అత్య‌ధిక చిత్రాల క‌థానాయ‌కుడిగా నాకు ప్ర‌త్యేకత‌ ల‌భించింది
  • ఆ ర‌కంగా మా కాంబినేష‌న్ ఎంతో స్పెష‌ల్
  • జ‌గ‌దేక వీరుడు లాంటి చిత్రాన్ని నాకు కానుక‌గా ఇచ్చారు
  • ద‌ర్శకేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు
chiranjeevi wishes raghavendra rao

ద‌ర్శకేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుకి మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. సినీరంగంలో ఆయ‌న‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అత్య‌ధిక చిత్రాల్లో తానే హీరోగా న‌టించాన‌ని చెప్పారు.

'ఆయ‌న సినీ ప్ర‌స్థానంలో అత్య‌ధిక చిత్రాల క‌థానాయ‌కుడిగా నాకు ఓ ప్ర‌త్యేకత‌ ల‌భించింది. ఆ ర‌కంగా మా కాంబినేష‌న్ ఎంతో స్పెష‌ల్, నా స్టార్‌డంని, క‌మ‌ర్షియ‌ల్ స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు. తెలుగు చిత్రాల్లో ఎప్ప‌టికీ అపురూపంగా నిలిచే జ‌గ‌దేక వీరుడు.. లాంటి చిత్రాన్ని నాకు కానుక‌గా ఇచ్చిన ద‌ర్శకేంద్రుడు శ్రీ రాఘ‌వేంద్ర‌రావు గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ప్రార్థిస్తున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.

More Telugu News