Kajal Agarwal: ఇంట్లో అల్లికలు, కుట్లతో సమ‌యాన్ని గడుపుతున్న హీరోయిన్ కాజ‌ల్.. ఫొటో ఇదిగో

kajal shares interesting pic
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా ఉద్ధృతి ఊహించ‌ని రీతిలో పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సెలబ్రిటీలు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో కొత్త విష‌యాల‌ను నేర్చుకుంటూ కాల‌క్షేపం చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్.. తాను ఇంట్లో ఉంటూ ఎలా కాల‌క్షేపం చేస్తున్నాన‌న్న విష‌యంపై ఇన్‌స్టాగ్రామ్‌లో వివ‌రాలు తెలిపింది.
          
ఒత్తిడి నుంచి బయటపడేందుకు తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లికలు, కుట్లతో  సమ‌యాన్ని గడుపుతున్న‌ట్లు తెలిపింది. మ‌న‌ చుట్టూ ప‌రిస్థితులు బాగోలేన‌ప్పుడు పాజిటివిటీ పెంచుకునేందుకు ఇలాంటి ప‌నులు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పింది. మనసుకు నచ్చిన పని చేస్తూ మానసిక ఒత్తిడిని జయించవచ్చునని తెలిపింది. త‌న‌ అల్లిక‌ల ప్ర‌తిభ‌ను చూపెడుతూ ఓ ఫొటో పోస్ట్ చేసింది  ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఆచార్య సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే.


Go Back to Shorts
Kajal Agarwal
Tollywood
Corona Virus

More Telugu News