Corona Virus: వ్యాక్సిన్ ఇలా కూడా ఇస్తారా?.. వైరల్ అవుతున్న వీడియో!

  • టీకా వేయకుండానే వేసినట్టు నటించిన నర్సు
  • సూది గుచ్చడంతో టీకా వేశారని భ్రమించిన లబ్ధిదారుడు
  • టీకా పేరుతో జరుగుతున్న మోసాలను కళ్లకు కట్టిన వీడియో
Fake corona vaccination

అవును, ఇప్పుడు ఇదే ప్రశ్న నెటిజన్లను వేధిస్తోంది. వ్యాక్సిన్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు నమ్మిస్తున్న వీడియో ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనిని చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు ఓ వ్యక్తి కూర్చున్నాడు. అతడి ఎడమ చేతి భుజానికి టీకా వేసేందుకు నర్స్ సిద్ధమైంది. తొలుత వ్యాక్సిన్ వేసే ప్రదేశాన్ని కాటన్‌తో క్లీన్ చేసింది. ఆ పై టీకా ఉన్న సిరంజిని అతడి చేతికి గుచ్చి వెంటనే తీసేసింది. మందును మాత్రం ఇంజక్ట్ చేయలేదు. లబ్ధిదారుడు మాత్రం తాను టీకా తీసుకున్నట్టే భావించాడు. టీకా పేరుతో జరుగుతున్న మోసాలను ఈ వీడియో కళ్లకు కడుతోంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.

More Telugu News