USA: అమెరికా నుంచి భార‌త్ చేరుకున్న 318 ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు

 318 Oxygen Concentrators arrive at Delhi airport from United States
షార్ట్స్‌లో చూడండి
భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చిన వేళ వైద్య ప‌రిక‌రాలు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన అమెరికా ఇచ్చిన మాటను నిల‌బెట్టుకుంది. భార‌త్‌కు ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేటర్స్‌ను పంపింది. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న రోగుల కోసం ఉప‌యోగించే ఈ ప‌రికరాల‌ను అమెరికా ప్ర‌భుత్వం నిన్న న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా ద్వారా ఢిల్లీకి పంపింది.

ఈ రోజు ఈ ప‌రిక‌రాలు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాయి. మొత్తం 318 ప‌రిక‌రాల‌ను భార‌త్‌కు అమెరికా పంపింది. వాటిని విమానం నుంచి సంబంధిత సిబ్బంది దించి, అవ‌స‌రం ఉన్న‌ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు.
Go Back to Shorts
USA
oxygen
New Delhi

More Telugu News