విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు మేము సిద్ధం: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
- వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం
- టీడీపీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం
- కేంద్రంపై అందరం కలిసి పోరాడాలి
మరోవైపు మరో మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దీనికి పూర్తిగా విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటే తాము రాజీనామాలకు సిద్ధమని చెప్పారు. రాజీనామాలు చేయడానికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెనుకాడరని అన్నారు. ఈ అంశంపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అందరం కేంద్రంపై కలిసి పోరాడి సాధించుకోవాలని చెప్పారు.