Telangana: తెలంగాణ‌లో క‌రోనా కేసుల తాజా వివరాలు!

Media Bulletin on status of positive cases  in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో కొత్త‌గా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 146 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,243  మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,624 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,731 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 678 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 29 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.
 
Go Back to Shorts
Telangana
Corona Virus
COVID19

More Telugu News