Corona Virus: దేశంలో కొత్త‌గా 13,193 మందికి కరోనా నిర్ధారణ

India reports 13193 new COVID19 cases
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 13,193 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 10,896 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,63,394 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 97 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,111కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,67,741 మంది కోలుకున్నారు. 1,39,542 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,01,88,007 మందికి వ్యాక్సిన్ వేశారు.
          
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,94,74,862 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,71,071 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News