K Kavitha: సిద్దులగుట్ట గుహలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు... వీడియో ఇదిగో!

  • సిద్దులగుట్ట శివాలయాన్ని దర్శించిన కవిత
  • భక్తిప్రపత్తులతో పూజా కార్యక్రమాలు
  • ట్విట్టర్ లో వీడియో పంచుకున్న కవిత
  • శివుడు సరైన దారిలో నడిపిస్తాడంటూ వ్యాఖ్యలు
Kalvakuntla Kavitha offered prayers at Siddulagutta Sivalayam

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని సిద్దులగుట్టకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి గుహలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇది స్వయంభువు ఆలయం అని నమ్ముతారు. తాజాగా ఈ గుహాలయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించారు. ఆచార సంప్రదాయాలను పాటిస్తూ గుహలో కొలువైన శివుడ్ని  అర్చించారు.

ఎంతో ఇరుకైన ఆ గుహలో కవిత భక్తిప్రపత్తులతో పరమశివుడి పూజల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. ఆర్మూర్ సిద్దులగుట్ట శివాలయంలో పూజలు చేశామని, ఆ పరమేశ్వరుడి దివ్యత్వం తమను ఎల్లప్పుడు సరైన దారిలో నడిపిస్తుందని తెలిపారు.

More Telugu News