తెలంగాణలో కొత్త‌గా 143 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్త‌గా 143 కరోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in Telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,277
  • కోలుకున్న వారు 2,92,848 మంది
  • మృతుల సంఖ్య 1,614
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు
తెలంగాణలో కొత్త‌గా 143 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు మృతి చెందారు. అదే సమయంలో 152 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,96,277కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,848 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,614గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,815 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో  838 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

  
Corona Virus
COVID19
Telangana

More Telugu News