ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ భామ ఐటమ్ సాంగ్!
- ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్'
- ప్రస్తుతం గోదావరి ఖనిలో షూటింగ్
- సినిమాలో మాస్ మాసాల ఐటమ్ సాంగు
- ప్రియాంక చోప్రా కోసం ప్రయత్నాలు
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన ఒక విశేషం ప్రచారంలో వుంది. ఈ సినిమాలో ఒక మాస్ మసాలా ఐటం సాంగు ఉందట. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి గాను బాలీవుడ్ భామ, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆమె కుదరని పక్షంలో మరో బాలీవుడ్ నటి దీపిక పదుకొణే నైనా తీసుకోవాలని చిత్ర దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుంది.