Corona Virus: ఏపీ కరోనా బులెటిన్: కొత్తగా 73 మందికి పాజిటివ్

AP Corona Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 33,980 కరోనా పరీక్షలు నిర్వహించగా 73 మందికి పాజిటివ్ అని తేలింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 15 కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రకాశం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, కడప జిల్లాలో 2 కొత్త కేసులు గుర్తించారు.

అదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,423 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,261 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,003కి తగ్గింది. కరోనా మృతుల సంఖ్య 7,159గా ఉంది.
Go Back to Shorts
Corona Virus
Bulletin
Andhra Pradesh
Positive Cases
Active Cases

More Telugu News