Andhra Pradesh: ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 97 మందికి పాజిటివ్

Andhra Pradesh Corona Bulletin
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 33,876 కరోనా పరీక్షలు నిర్వహించగా 97 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 11, విశాఖపట్నం జిల్లాలో 10 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, కృష్ణా జిల్లాలో ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,88,275 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,80,046 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,071కి పడిపోయింది. అటు మొత్తం మరణాల సంఖ్య 7,158కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Positive Cases
Deaths
Active Cases

More Telugu News