Corona Virus: ఏపీ కరోనా అప్ డేట్: కొత్తగా 79 మందికి పాజిటివ్

AP Corona Update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 28,254 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 20 కేసులు గుర్తించారు. విశాఖ జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 87 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించలేదు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 8,88,178 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,79,867 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,154 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 7,157గా నమోదైంది.
Go Back to Shorts
Corona Virus
Positive Cases
Andhra Pradesh
Active Cases
Tests

More Telugu News