తెలంగాణలో కొత్తగా 177 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో కొత్తగా 177 కరోనా కేసులు

177 new cases in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101
  • కోలుకున్న వారు 2,91,510 మంది
  • మృతుల సంఖ్య 1,606
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 30 కరోనా కేసులు  
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 177 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 198 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,91,510 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,606కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 1,985 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 776 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 30 కరోనా కేసులు నమోదయ్యాయి.

  
Corona Virus
COVID19
Telangana

More Telugu News