తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!
Add ap7am to your home Screen

తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

163 new cases in telangana
  • కొత్తగా 163 కరోనా కేసులు
  • మొత్తం కేసుల సంఖ్య 2,94,469
  • మృతుల సంఖ్య 1,599
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 276 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం  2,90,630 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,599 కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం  2,240  మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 828 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 28 కరోనా కేసులు నమోదయ్యాయి.


Corona Virus
COVID19
Telangana

More Telugu News