Corona Virus: తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్తగా 189 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,590
  • మృతుల సంఖ్య 1592కి
189 new corona cases in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 349 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,590కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,88,926 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1592కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,072 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,543 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి.

More Telugu News