గత మూడ్నెల్లకు పైగా తెలుగు ప్రేక్షకులకు సరైన వినోదం అందించిన బిగ్ బాస్-4 రియాల్టీ షో నేటితో ముగియనుంది. ఇవాళ్టి గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. చిరంజీవి గత సీజన్ లోనూ విన్నర్ ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. తనదైన టైమింగ్ తో నాడు అద్భుతమైన కామెడీ పండించిన చిరు మరోసారి తన మార్కు వినోదం అందించేందుకు వచ్చారు. బిగ్ బాస్ నాలుగో సీజన్ విజేతకు కూడా తన చేతుల మీదుగా ట్రోఫీ అందించనున్నారు.