మహేశ్‌ బాబుపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన హీరోయిన్ సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్‌ బాబుపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టిన హీరోయిన్ సాయిపల్లవి

sai pallavi interesting words about mahesh
  • మహేశ్‌బాబు చాలా అందంగా ఉంటాడు
  • ఆయన స్కిన్‌ ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉంటుంది
  • లుక్స్ ‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడోనని ఆశ్చర్యపోతుంటా
  • ఆయన ఫొటోల్ని జూమ్‌ ఇన్‌లో చూసేదాన్ని
టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుపై ఉన్న అభిమానాన్ని హీరోయిన్ సాయిపల్లవి బయటపెట్టింది. ఆయన అందానికి తాను ఎంతగా ఫిదా అయిపోతానో తెలిపింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మహేశ్‌బాబు చాలా అందంగా ఉంటాడని కితాబునిచ్చింది. ఆయన స్కిన్‌ ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉంటుందని చెప్పింది.

తాను మహేశ్ బాబు‌ ఫొటోలు చూస్తున్న సమయంలో లుక్స్ ‌పరంగా ఒక వ్యక్తి ఇంత పర్‌ఫెక్ట్‌గా ఎలా ఉంటాడోనని ఆశ్చర్యపోతుంటానని తెలిపింది. చాలాసార్లు ఆయన ఫొటోల్ని జూమ్‌ ఇన్‌లో చూసేదానినని చెప్పింది. మహేశ్ ముఖంపై ఒక్కమచ్చ కూడా ఉండదని చెప్పింది.

 పోతే, సాయిపల్లవి ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న టాలీవుడ్ సినిమా  'లవ్ స్టోరీ' లో నటిస్తోన్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగానే ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
Sai Pallavi
Mahesh Babu
Tollywood

More Telugu News