Sai Pallavi: ఆ సీన్‌లో హీరో పెదవులపై ముద్దుపెట్టాలని దర్శకుడు అన్నాడు.. నో చెప్పాను: సాయిపల్లవి

  • ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించాను 
  • నాకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని చెప్పేశా
  • మీ టూ కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నా
did not accept in liplock scene says sai pallavi

దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి తాను సినిమాలను ఎంపిక చేసుకుంటోన్న తీరు, వాటిల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో  మాట్లాడింది. తాను ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించే సమయంలో ఆ సినిమా హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు చెప్పాడని ఆమె తెలిపింది.

అయితే, తనకు అటువంటి సీన్‌లో నటించడం కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని తెలిపింది. తాను మీ టూ కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నానని వ్యాఖ్యానించింది. ఆ సినిమా పేరును ఆమె బయటపెట్టలేదు.

తెలుగు సినిమా 'ఫిదా'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి అనంతరం పలు సినిమాల్లో తన నటన, డ్యాన్సులతో మెప్పించింది. ప్రస్తుతం తమిళ భాషలో వెబ్‌ సిరీస్‌ అంథాలజీ 'పావకథైగల్‌'లోని ఓ పార్ట్‌లో ఆమె నటిస్తోంది.

More Telugu News