Sachin Tendulkar: రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సచిన్

  • నేడు రజనీకాంత్ పుట్టినరోజు
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలన్న సచిన్
  • భగవంతుడు దీర్ఘాయుష్షు ఇవ్వాలంటూ ఆకాంక్ష
  • తలైవా అంటూ ట్వీట్
Sachin Tendulker wishes Rajinikanth on his birthday

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైతం తలైవాకు విషెస్ తెలిపారు. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తన అభిమాన హీరోకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తలైవా... ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలంటూ ఆకాంక్షించారు. మీకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్షును, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు సచిన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, రజనీతో తాను కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు.

More Telugu News