Lavanya Tripathi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • నిర్ణయానికి కట్టుబడిన లావణ్య త్రిపాఠి 
  • ప్రభాస్ ని కలసిన 'కేజీఎఫ్' దర్శకుడు
  • సినిమాల విషయంలో కమల్ తాజా నిర్ణయం  
Lavanya Tripathi rejects some commercials

*  మన సినిమా తారలు సినిమాలు చేస్తూనే, మంచి పారితోషికాన్ని అందించే వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ వుంటారు. అయితే, కథానాయిక లావణ్య త్రిపాఠి మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వుంటుందట. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులకు ప్రచారం చేయనని కరాఖండీగా చెప్పేస్తోంది. ఈమధ్య భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినప్పటికీ అలాంటి కొన్ని ఆఫర్లను ఈ ముద్దుగుమ్మ తిరస్కరించిందట.
*  'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు ప్లాన్ చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా హైదరాబాదులో ఆయన ప్రభాస్ ని కలిసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో చేసే సినిమా గురించిన చర్చల కోసమే ఆయన కలిసినట్టు సమాచారం.
*  ప్రముఖ నటుడు కమలహాసన్ ప్రస్తుతం శంకర్ తో 'ఇండియన్ 2', లోకేశ్ కనగరాజ్ తో 'విక్రమ్' సినిమాలు చేస్తున్నాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రాజకీయంగా తాను బిజీ అవుతాడు కాబట్టి, ఈ రెండు చిత్రాలను మార్చి లోపల పూర్తి చేసేయాలని నిర్ణయించుకున్నాడట.

More Telugu News