నన్ను ఫాలో అవ్వండి... అంటూ సచిన్ కు దారిచూపిన ఆటోవాలా!
- ముంబయి శివార్లలో దారితప్పిన సచిన్
- హైవేకు చేరుకోలేక ఇబ్బందులు
- సచిన్ ను హైవే వద్దకు చేర్చిన ఆటోవాలా
అయితే, తనను రూట్ చెప్పమని అడిగింది క్రికెట్ గాడ్ కావడంతో ఆ ఆటోవాలా ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇంకేమీ ఆలోచించకుండా, "నన్ను ఫాలో అవ్వండి... నా ఆటో వెనుకే రండి" అంటూ బదులిచ్చాడు. అంతేకాదు, తన ఆటోను హైవే దిశగా తీసుకెళ్లి సచిన్ కు దారి చూపించాడు. ఆ ఆటోనే ఫాలో అయిన సచిన్ చివరికి హైవే చేరుకుని హమ్మయ్య అనుకున్నారు. ఆ ఆటోవాలాకు ఓ సెల్ఫీ ఇచ్చి సంతోషం కలిగించారు.
కాగా ఈ ఘటన గత జనవరిలో చోటుచేసుకోగా, ప్రముఖ పాత్రికేయుడు రాజ్ దీప్ సర్దేశాయ్ దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.