Tamil Nadu: కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలకలం రేపిన ‘నేడు ఆఖరి రోజు’ పార్శిల్

A parcel at collectorate fears people
షార్ట్స్‌లో చూడండి
‘నేడు ఆఖరి రోజు’ అంటూ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వేలాడుతున్న ఓ పార్శిల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తమిళనాడులోని తేని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిందీ ఘటన. అక్కడి ప్రాంగణంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న పార్శిల్‌ను చూసిన ప్రజలు.. దానిపై ‘నేడు ఆఖరి రోజు’ అని పెద్దపెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో చూసి భయభ్రాంతులకు గురయ్యారు. రుమాలుతో చుట్టి ఉన్న ఈ పార్శిల్‌ చుట్టూ నక్షత్రాల బొమ్మలున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టుకు వేలాడుతున్న పార్శిల్‌ను కిందికి దింపి విప్పి చూశారు. అది ఖాళీగా ఉండటం, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అట్టపెట్టెపై తెల్లని కాగితాన్ని అంటించి ఇలా రాసి ఉంటారని భావిస్తున్నారు. కార్యాలయ ప్రాంగణంలో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండడాన్ని గుర్తించిన పోలీసులు, అతడే ఈ పని చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Go Back to Shorts
Tamil Nadu
Parcel
collectorate
Police

More Telugu News