క్రికెట్‌లో కొత్త రూల్ పెట్టాలన్న సచిన్ టెండూల్కర్
- హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల గాయపడుతున్న బ్యాట్స్ మెన్లు
- హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలనే నిబంధన తీసుకురావాలన్న సచిన్
- సచిన్ సూచనకు పలువురి మద్దతు
బ్యాట్స్ మెన్లు బ్యాటింగ్ చేసేటప్పుడు వారికి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. బౌలర్లు విసిరే బంతులు బౌన్స్ అయి వారి ముఖాలను తీవ్రంగా గాయపరుస్తుంటాయి. స్పిన్నర్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా గాయపడిన బ్యాట్స్ మెన్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో సచిన్ ఒక సూచన చేశాడు. ఫాస్ట్ బౌలర్ ను ఎదుర్కొనేటప్పుడైనా లేదా స్పిన్నర్ ను ఎదుర్కొనే సమయంలోనైనా బ్యాట్స్ మెన్లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను తీసుకురావాలని సూచించాడు. ప్రొఫెనల్ స్థాయిలో ఆడే ప్రతి ఆటగాడు ఈ నిబంధనను పాటించాలని చెప్పాడు. సచిన్ చేసిన ఈ సూచనకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు.