Bandaru Satyanarayana Murthy: బాలికపై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా?: టీడీపీ నేత బండారు

Shall we clap for volunteer for raping a girl asks Bandaru Satyanarayana Murthy
  • వాలంటీర్ల కోసం సాయంత్రం చప్పట్లు కొడదామన్న జగన్
  • చప్పట్లు కొట్టాలా లేక చెట్టుకి కట్టేసి కొట్టాలా? అని బండారు ప్రశ్న
  • నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా? అని నిలదీత
గ్రామ వాలంటీర్ల సేవలను గౌరవిస్తూ ఈ సాయంత్రం అందరం ఇంటి నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడదామని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళపై అత్యాచారం చేసిన వాలంటీర్ కి కృతజ్ఞతలు తెలపాలా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వారికి చప్పట్లు కొట్టాలా లేక చెట్టుకి కట్టేసి కొట్టాలా? అని అడిగారు.

'బాలిక పై అత్యాచారం చేసిన వాలంటీర్ కి చప్పట్లు కొట్టాలా? వృద్ధురాలి మెడలో గొలుసు కొట్టేసిన వాలంటీర్ కి సత్కారం చెయ్యాలా? నాటు సారా కాసిన వాలంటీర్ ని అభినందించాలా? అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన వాలంటీర్ కి సన్మానం చెయ్యాలా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ గారు' అని ట్వీట్ చేశారు.
Bandaru Satyanarayana Murthy
Telugudesam
Jagan
YSRCP
Volunteers

More Telugu News