మా కుటుంబం మొత్తానికి సినిమాయే ప్రాణం: అల్లు ఫ్యామిలీ

Allu family inaugurates Allu Studios on Allu Ramalingaiah birth anniversary
సుప్రసిద్ధ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా అల్లు వారి ఫ్యామిలీ ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోస్ పేరిట భారీ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు.  

అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు. అల్లు స్టూడియోస్ ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామని తెలిపారు.

హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టూడియో రూపుదిద్దుకోనుంది. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మానం ఉండనుంది .
Go Back to Shorts
Allu Studios
Allu Arjun
Allu Sirish
Allu Aravind
Allu Bobby
Tollywood

More Telugu News