ఈగను చంపబోయి ఇంటిని తగలబెట్టుకున్నాడు!
- ఫ్రాన్స్‌లోని చిన్న గ్రామంలో ఘటన
- తినే సమయంలో అతడి ముందుకొచ్చి చికాకు పరిచిన ఈగ
- చంపేందుకు బయలుదేరి ప్రాణాలతో బయటపడిన వృద్ధుడు
ఈగ ఇల్లంతా తిరుగుతూ చివరికి వంట గదిలోకి దూరింది. అతడు కూడా దాని వెనకే అందులోకి దూరాడు. అయితే, అప్పటికే కిచెన్‌లో గ్యాస్ లీకవుతోంది. ఈ విషయాన్ని గుర్తించని వృద్ధుడు గదిలోకి ప్రవేశించిన వెంటనే, చేతిలో వున్నది ఎలక్ట్రిక్ బ్యాట్ కావడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో వంటగదిలో పేలుడు చోటుచేసుకుంది. దీంతో కిచెన్ ధ్వంసం కాగా, ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది. అయితే, వృద్ధుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడిని గాయాలపాలు చేసిన ఈగ తప్పించుకుందా? లేక, ఆ మంటల్లో కాలి బూడిదైందా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. వృద్ధుడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గురించి తెలిశాక మనకు రాజమౌళి తీసిన 'ఈగ' సినిమా గుర్తుకు వస్తుంది కదూ?