బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరిట వున్న ఖాతాను నిషేధించిన ఫేస్ బుక్

Facebook suspends Raja Singhs account
  • తమ నిబంధనలను ఉల్లంఘించారన్న ఫేస్ బుక్
  • హింసను ప్రేరేపించే కామెంట్స్ చేశారని వివరణ
  • తనకు ఫేస్ బుక్ అకౌంట్ లేదన్న రాజాసింగ్
తెలంగాణ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పేరిట వున్న ఖాతాను ఫేస్ బుక్ యాజమాన్యం నిషేధించింది. దీనిపై ఫేస్ బుక్ స్పందిస్తూ... ఎవరైనా ద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తమ నిబంధనలు ఒప్పుకోవని తెలిపింది. హింసను ప్రేరేపించే వ్యాఖ్యలకు సంబంధించి తమ నిబంధనలను రాజాసింగ్ ఉల్లంఘించారని చెప్పింది. ఈ కారణం వల్లే రాజాసింగ్ పై నిషేధం విధించామని తెలిపింది. మరోవైపు వారం క్రితమే రాజాసింగ్ ఓ వివరణ ఇచ్చారు. తనకు ఫేస్ బుక్ పేజ్ లేదని... తన పేరు మీదుగా అనేక మంది ఫేస్ బుక్ పేజీని నడుపుతున్నారని చెప్పారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద వచ్చే ఏ పోస్టుకూ తాను బాధ్యుడిని కాదని ఆయన చెప్పారు.
Go Back to Shorts
BJP
Facebook
Ban
Raja Singh

More Telugu News