Kajal Aggarwal: ఆ సినిమాలో సూర్య, నేను అసలు ముద్దు పెట్టుకోలేదు.. అలా చూపించారంతే!: హీరోయిన్ కాజల్‌

  • 'బ్రదర్స్‌' అనే సినిమాలో లిప్‌లాక్‌ సీన్
  • సూర్య చాలా ఇబ్బంది పడ్డారు
  • బ్లూ మ్యాట్‌ ముందు పెట్టి సీన్‌ తీశారు
  • ఇద్దరి ముద్దులను గ్రాఫిక్స్‌లో లిప్‌లాక్‌లా చూపించారు
kajal about liplock scene

తమిళ హీరో సూర్యతో కలిసి హీరోయిన్ కాజల్ గతంలో 'బ్రదర్స్‌' సినిమాలో నటించిన విషయం తెలిసిందే. విభిన్నకథతో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, కాజల్ లిప్‌లాక్‌ సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌పై కాజల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నిజానికి తామిద్దరం ఆ సీన్‌ కోసం ముద్దు పెట్టుకోలేదని చెప్పింది. ఆ సినిమా షూటింగ్‌లో ముందు అనుకున్న దాని ప్రకారమైతే అలాంటి ముద్దు సీన్‌ లేదని చెప్పింది.

అయితే, అనంతరం ఆ సీన్ చాలా ముఖ్యం అని భావించడంతో దాన్ని తీయాలని అనుకున్నారని,  సూర్య చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది. దీంతో దర్శకుడు ఆనంద్‌ తమ ఇద్దరి మధ్య ఆ సీన్‌ను వినూత్న రీతిలో బ్లూ మ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి తీశారని చెప్పింది. ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి దాన్ని తీశారని చెప్పింది. అనంతరం తనకు ఎదురుగా బ్లూమ్యాట్‌తో తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారని వివరించింది. ఆ తర్వాత తమ ఇద్దరి ముద్దులను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా చూపించారని చెప్పింది. అది గ్రాఫిక్స్ అని ఎవ్వరూ గుర్తించలేకపోయారని తెలిపింది.

More Telugu News