చిరంజీవికి అరుదైన గౌరవం... 100 మంది దక్షిణాది సినీతారలు షేర్ చేసిన డీపీ!
- నిన్న చిరంజీవి 65వ పుట్టిన రోజు
- కామన్ డీపీని విడుదల చేసిన రామ్ చరణ్
- ఎంతో మంది షేర్ చేయడంతో వైరల్
ఇక ఈ చిత్రంలో చిరంజీవి నటించిన పలు హిట్ చిత్రాల స్టిల్స్ కనిపిస్తున్నాయి. ఖైదీ, పసివాడి ప్రాణం, స్వయంకృషి, ఘరానా మొగుడు, ఇంద్ర, ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల స్టిల్స్ తో దీన్ని తయారు చేశారు.
కాగా, కరోనా సమయంలో పనిలేక తీవ్రంగా నష్టపోయిన తెలుగు సినీ కళాకారులను ఆదుకునేందుకు కరోనా క్రైసెస్ చారిటీ పేరిట ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన మెగా ఫ్యామిలీ, ఈ ఆరు నెలల కాలంలో పలుమార్లు కార్మికులకు నిత్యావసరాలను అందించిన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య' టైటిల్ మోషన్ పోస్ట్ ను విడుదల చేయగా, అది కూడా వైరల్ అయింది.