మార్చురీలో సుశాంత్ మృతదేహం వద్ద రియా ఏం చేసిందో చెప్పిన కర్ణిసేన సభ్యుడు సూర్జీత్ సింగ్!

మార్చురీలో సుశాంత్ మృతదేహం వద్ద రియా ఏం చేసిందో చెప్పిన కర్ణిసేన సభ్యుడు సూర్జీత్ సింగ్!

Karni sena member Surgeet Rathore reveals what Rhea has done at Sushant dead body
  • జూన్ 14న సుశాంత్ రాజ్ పుత్ మరణం
  • మరుసటి రోజు కూపర్ ఆసుపత్రిలో అటాప్సీ
  • రియా ముఖంలో అపరాధభావం కనిపించిందన్న సూర్జీత్
ముంబయిలో జూన్ 14న బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆ మరుసటి రోజు మృతదేహానికి కూపర్ ఆసుపత్రిలో అటాప్సీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా వచ్చిందని, ఆ సమయంలో ఆమె మార్చురీ వద్ద ఉండగా తాను చూశానని కర్ణిసేన సభ్యుడు సూర్జీత్ సింగ్ రాథోడ్ వెల్లడించారు. కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆ రోజు తాను కూపర్ ఆసుపత్రికి వెళ్లానని, ఆ సమయంలో రియా ముఖంలో తప్పు చేసిన ఫీలింగ్ కనిపించిందని తెలిపారు.

సుశాంత్ మృతదేహాన్ని చూసేందుకు అనుమతి లభించిన వెంటనే ఆమె సుశాంత్ ఛాతీపై చేయి ఆన్చి క్షమించు బాబు అన్నదని వివరించారు. ఆ సమయంలో రియాలో అపరాధభావం కొట్టొచ్చినట్టు కనిపించిందని సూర్జీత్ సింగ్ చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహిస్తున్న సీబీఐకి సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సూర్జీత్ స్పష్టం చేశారు.
Surjeet Rathore
Rhea Chakraborty
Sushant Singh Rajput
Dead Body
Cooper Hospital

More Telugu News