కంగ్రాచ్యులేషన్స్ ధోనీ... నీ ఘనత తరతరాలకు స్ఫూర్తిదాయకం: సీఎం జగన్
- రిటైర్మెంటు ప్రకటించిన ధోనీ
- మహోజ్వలమైన కెరీర్ అంటూ అభినందనలు
- భవిష్యత్తులో విజయవంతం కావాలంటూ ట్వీట్
కంగ్రాచ్యులేషన్స్ ధోనీ అంటూ ఈ ఝార్ఖండ్ డైనమైట్ ను అభినందించారు. మహోజ్వలమైన కెరీర్ ను సొంతం చేసుకున్నావంటూ ప్రశంసించారు. నువ్వు సాధించిన ప్రాభవం తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఔత్సాహికులకు ధోనీ ఘనతలు ప్రేరణ కలిగిస్తాయని వివరించారు. ధోనీ భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ ట్వీట్ చేశారు.