శ్రీదేవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి: ఉద్యమం ప్రారంభించిన అభిమానులు
- హీరో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచారణ
- ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతిపై విచారణ కోసం డిమాండ్
- ఆగస్టు 13న శ్రీదేవి జయంతి
- సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
దుబాయ్‌లో ఓ వేడుకకు వెళ్లి అక్కడే తాను ఉన్న హోటల్ గదిలోని బాత్ టబ్‌లో పడి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ సందర్భంగా ఆమె మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె అభిమానులు ఇప్పటికీ అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
సుశాంత్ మృతిలో సీబీఐ విచారణ కొనసాగుతుండడం, ఆగస్టు 13న శ్రీదేవి జయంతి ఉండడం వంటి అంశాల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు సీబీఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి హ్యాష్ ట్యాగ్‌తో ఆమె మృతిపై విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన రెండున్నరేళ్ల తర్వాత ఈ డిమాండ్ ఊపందుకోవడం గమనార్హం.