రాకేశ్ చౌదరిని వెంటనే విడుదల చేయాలని డీజీపీకి లేఖ రాశాను: చంద్రబాబు
- సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా?
- టీడీపీ వాళ్లు పెట్టకూడదా?
- పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ ను వేరే కేసులో అరెస్ట్ చేశారు
సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు మాత్రమే పోస్టులు పెట్టాలా? టీడీపీ వాళ్లు పెడితే పోలీసులు బెదిరిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోస్టులు తొలగించనని చెప్పినందుకు రాకేశ్ పై కుట్ర చేశారని... వేరే కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాకేశ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి లేఖ రాశానని చెప్పారు.