అందుకే నేను చిరునవ్వుతో నిద్రలేస్తా: వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ సాయి పల్లవి
- ఉదయాన్నే నన్ను భూమాత సర్‌ప్రైజ్ చేస్తుంది
- ఉదయాన్నే ఆహ్లాదకర వాతావరణం
- ఇంద్రధనుస్సు కనపడింది
ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఉదయాన్నే తనను భూమాత సర్‌ప్రైజ్ చేస్తుందని ఆమె తెలిపింది. అందుకే తాను ఎల్లప్పుడూ చిరునవ్వుతో నిద్రలేస్తానని చెప్పింది. తన ఇంటి బయట నుంచి ఆకాశంలోకి చూస్తే ఎలాంటి అద్భుతం కనపడుతుందో తెలిపే వీడియోను ఆమె పోస్ట్ చేసింది. చాలా పెద్ద ఇంద్రధనుస్సు ఇందులో కనపడుతోంది. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం కారణంగానే తాను ఉదయాన్నే సంతోషంగా గడుపుతానని చెప్పింది. ఆమె పోస్ట్ చేసిన వీడియో అభిమానులను అలరిస్తోంది.