Sachin Tendulkar: తన కల నెరవేర్చుకునేందుకు కాంగ్రెస్ ముందు సచిన్ పైలట్ పెట్టిన డిమాండ్ ఇది!

  • నన్ను సీఎంను చేయాల్సిందే
  • అందుకు ఏడాది సమయం తీసుకోండి
  • ప్రియాంకా గాంధీకి స్పష్టంగా చెప్పిన సచిన్ పైలట్
  • ఇంకా ఏ హామీ ఇవ్వని ప్రియాంకా గాంధీ
Sachin Pilot Demand Infront of Priyanka Gandhi

ఓ వైపు సచిన్ పైలట్ ను వదులుకోరాదని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం భావిస్తున్న వేళ, తాను పార్టీలో కొనసాగాలంటే, తనను ముఖ్యమంత్రిని చేయాలని సచిన్ పైలట్ పార్టీ నేతల ముందు ఓ డిమాండ్ ను పెట్టారు. ఇందుకోసం తాను ఏడాది కాలం పాటు వేచి చూస్తానని ప్రియాంకా గాంధీతో సచిన్ పైలట్ గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. తన డిమాండ్ విషయంలో సానుకూలంగా స్పందించేంత వరకూ తాను సోనియా గాంధీనిగానీ, రాహుల్ గాంధీని కానీ కలిసే ఉద్దేశం తనకు లేదని సచిన్ పైలట్ స్పష్టం చేసినట్టు ప్రియాంకా గాంధీ వర్గం వెల్లడించింది.

కాగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెంచుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీలో సీనియర్ నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్ గెహ్లాట్ వైపే సోనియా మొగ్గు చూపారు. దీంతో సచిన్ పైలట్ కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిని, పీసీసీ బాధ్యతలను అప్పగించి, గెహ్లాట్ ను సీఎంను చేశారు. అప్పటి నుంచి కినుక వహించిన సచిన్ పైలట్, ఇప్పుడు తన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేసేందుకు రెడీ అయ్యారు.

ఆపై రాజస్థాన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడగా, పరిస్థితులను సరిదిద్దే బాధ్యతలను తనపై వేసుకున్న ప్రియాంకా గాంధీ, ఇటీవల సచిన్ పైలట్ తో ఫోన్ లో మాట్లాడారు. ఆ సమయంలో తనను సీఎంను చేస్తామని బహిరంగ ప్రకటన చేయాలని కోరారని, అయితే, ఈ విషయంలో ఇంతవరకూ ప్రియాంక ఎటువంటి హామీని ఇవ్వలేదని ఆమె కోటరీలోని నేతలు వ్యాఖ్యానించారు. తాను రాహుల్, సోనియాలతో మాట్లాడిన తరువాత ఏ విషయమూ తెలియజేస్తానని ఆమె పేర్కొన్నట్టు వెల్లడించారు.

More Telugu News