ఇద్దరూ నష్టపోతారు: భారత్-చైనాలకు దలైలామా హెచ్చరిక
- రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి
- పక్క దేశానికి నష్టం చేయాలని ఎవరూ ప్రయత్నించవద్దు
- ఇరు దేశాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉండాలి
శాంతికి చిహ్నమైన బౌద్ధానికి చైనా చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉందని... అలాంటి బౌద్ధానికి గురువైన బుద్ధుడి జన్మస్థలం భారత్ అని దలైలామా తెలిపారు. అందుకే ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ, ఇతర దేశాలకు మార్గదర్శకంగా ఉండాలని హితవు పలికారు. 2011 నుంచి దలైలామా పాలనాపరమైన అంశాలపై వ్యాఖ్యానించలేదు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి ఆయన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై స్పందించారు.