చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో చేతులు కలపండి.. బాలీవుడ్‌ తారలకు, క్రీడాకారులకు సీఏఐటీ పిలుపు
Add ap7am to your home Screen

చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో చేతులు కలపండి.. బాలీవుడ్‌ తారలకు, క్రీడాకారులకు సీఏఐటీ పిలుపు

We request Bollywood  Sports fraternity to join hands with CAIT for boycott of Chinese goods
  • మరోసారి ఊపందుకున్న చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం
  • అఖిల భారత వ్యాపారుల సమాఖ్య మద్దతు
  • ప్రముఖులకు పిలుపు
తూర్పు లడఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా-భారత్ సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన వేళ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదన్న ఉద్యమం మరోసారి ఊపందుకుంది. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలికింది. దేశంలోని ప్రముఖులకు కీలక సూచనలు చేసింది.

దేశ ప్రయోజనాల దృష్ట్యా చైనా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలని తాము నిర్ణయం తీసుకున్నామని, బాలీవుడ్‌ తారలు, క్రీడా రంగ ప్రముఖులు తమతో చేతులు కలిపి ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలని సీఏఐటీ ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా ఉత్పత్తులను వాడకూడదని పిలుపునిచ్చింది.

               
Bollywood
China
India

More Telugu News