'నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా' అంటూ లేఖరాసి టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య
Add ap7am to your home Screen

'నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా' అంటూ లేఖరాసి టెన్త్‌ విద్యార్థి ఆత్మహత్య

sushant fan suicide
  • ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఘటన
  • బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు వీరాభిమాని
  • సుశాంత్‌ ఆత్మహత్యతో మనస్తాపం
'నా హీరో ఆత్మ‌హత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా' అంటూ ఆత్మహత్య లేఖ రాసి ఓ అభిమాని సూసైడ్‌ చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌కి బరేలికి చెందిన ఓ పదో తరగతి విద్యార్థి వీరాభిమాని.

సుశాంత్ సినిమాలంటే అతడు చాలా ఇష్టపడేవాడు. సుశాంత్ మృతిచెందడంతో ఆ విద్యార్థి తట్టుకోలేకపోయాడు. తన హీరోలేని జీవితం తనకు వద్దని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి చివరకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.
sushant
Bollywood

More Telugu News